logo

Tenali: ఇప్పుడు గుర్తొచ్చామా సారూ.. ఎమ్మెల్యేని ప్రశ్నించిన మహిళ

ఎన్నికల ముందు ఇళ్ల పట్టాలిస్తామన్నామని చెప్పారూ.. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి.. ఇప్పుడు గుర్తొచ్చామా సార్‌ అంటూ సుల్తానాబాదు ఎస్సీ కాలనీకి చెందిన రమావత్‌ గాయత్రి అనే మహిళ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ప్రశ్నించింది.

Updated : 05 Feb 2023 09:43 IST

ఇళ్ల పట్టాలు ఇస్తామన్నారంటూ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తున్న రమావత్‌ గాయత్రి

తెనాలి(కొత్తపేట), న్యూస్‌టుడే: ఎన్నికల ముందు ఇళ్ల పట్టాలిస్తామన్నామని చెప్పారూ.. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి.. ఇప్పుడు గుర్తొచ్చామా సార్‌ అంటూ సుల్తానాబాదు ఎస్సీ కాలనీకి చెందిన రమావత్‌ గాయత్రి అనే మహిళ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను ప్రశ్నించింది. దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఇక్కడ అరవైళ్ల నుంచి బీ ఫారాలతోనే ఉంటున్నారు కదా అని ఆయన అడిగారు. ఎన్నాళ్లు ఇలా ఉండమంటారు, అందుకే కదా పట్టా ఇప్పించాలని కోరుతున్నానని ఆమె మరోసారి ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసింది. అందుకే కదా పట్టాలిప్పించే కార్యక్రమాన్ని తీసుకువచ్చామంటూ ఆయన బదులిచ్చారు.  ఈ ఘటన శనివారం 29వ వార్డులో నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో జరిగింది. అనంతరం పలువురు డ్వాక్రా మహిళలు, ఆర్పీలు రుణం ఇప్పించినందుకు రూ.1000 నుంచి రూ.1,200 వరకు వసూలు చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వీధి దీపాలు, రోడ్లు, కాలువలు నిర్మించాలని కోరారు. ఆర్పీలపై విచారణ జరిపించి వాస్తవమని రుజువైతే చర్యలు తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. కాలువలు, రోడ్లు వీధి దీపాలు వేయిస్తానని భరోసా ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని