logo

భట్టిప్రోలులో ఆస్ట్రేలియా యువకుడు

ప్రపంచ దేశాలను కాలినడకన చుట్టిరావాలనే లక్ష్యంతో తన యాత్ర ప్రారంభించిన ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల సెబాస్టియన్‌ శనివారం భట్టిప్రోలు వచ్చారు.

Published : 05 Feb 2023 04:32 IST

భట్టిప్రోలు, న్యూస్‌టుడే : ప్రపంచ దేశాలను కాలినడకన చుట్టిరావాలనే లక్ష్యంతో తన యాత్ర ప్రారంభించిన ఆస్ట్రేలియా దేశంలోని సిడ్నీ ప్రాంతానికి చెందిన 28 ఏళ్ల సెబాస్టియన్‌ శనివారం భట్టిప్రోలు వచ్చారు. ఇప్పటికే తాను 12 దేశాలు తిరిగానని పేర్కొన్నారు. తాను సందర్శించిన ప్రాంతాల్లో ప్రకృతి అందాలు, మతాలు, ఆచారాలు, సంప్రదాయాలు తెలుసుకోవడం తనకెంతో ఆసక్తి అన్నారు. ప్రతి గ్రామంలోనూ ప్రజల ఆదరణ తనకు లభిస్తోందన్నారు. తన ఈ ప్రయాణంలో తాను తెచ్చుకున్న నగదు అయిపోతే తిరిగి విమానంలో స్వదేశానికి వెళ్లి మళ్లీ నగదు కూడబెట్టుకుని యాత్ర చేస్తానన్నారు. త్వరలో విశాఖ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి కొంతకాలం ఉద్యోగం చేసి మళ్లీ నగదు సమకూరిన వెంటనే ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తానని వివరించారు. రేపల్లె నుంచి భట్టిప్రోలు మీదుగా తెనాలికి చేరుకోనున్నట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు