logo

ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపణలు సహేతుకం కావు

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ తన ఫోన్‌ని ప్రభుత్వ పెద్దలు ట్యాపింగ్‌ చేయించారంటూ చేసిన ఆరోపణలు సహేతుకం కావని శాసనమండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 05 Feb 2023 04:32 IST

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే : నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ తన ఫోన్‌ని ప్రభుత్వ పెద్దలు ట్యాపింగ్‌ చేయించారంటూ చేసిన ఆరోపణలు సహేతుకం కావని శాసనమండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం గుంటూరులో ఆయన పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య, జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలపై కేంద్రంలోని హోం శాఖ విచారణ చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయదన్నారు. ఈ విషయాన్ని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలుసుకోవాలన్నారు. వైకాపాను వీడేందుకు నిర్ణయం తీసుకున్న తర్వాత ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలవాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంతో ఉన్నారని.. ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని