logo

గృహాలు పూర్తయ్యేదెన్నడో!

గుంటూరు నగరంలోని నిరుపేదలకు మేడికొండూరు మండలం పేరేచర్ల శివారులోని జగనన్న ఇళ్ల కాలనీలో 20వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు.

Published : 06 Feb 2023 05:33 IST

పేరేచర్ల జగనన్న కాలనీలో పునాదుల దశలోనే గృహ నిర్మాణాలు

గుంటూరు నగరంలోని నిరుపేదలకు మేడికొండూరు మండలం పేరేచర్ల శివారులోని జగనన్న ఇళ్ల కాలనీలో 20వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. రెండేళ్ల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చిన అధికారులు అనంతరం గృహ నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ కేటగిరి 3లో లబ్ధిదారుల ఇళ్లు నిర్మించేందుకు అధికార పార్టీ వారికి చెందిన సంస్థను ప్రభుత్వం ఎంపిక చేసింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పునాదుల దశలోనే గృహాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో కూడా నిర్మాణాలు పూర్తి కాలేదు. గుత్తేదారు సిమెంటు ఇటుకల యూనిట్‌ని ఇటీవల ఏర్పాటు చేశారు. సొంతంగా ఇటుకల తయారు చేసి గృహ నిర్మాణాలు చేయాలనేది ప్రణాళిక. ఇటుకల యూనిట్‌ సాంకేతిక సమస్యలు తీరి నిర్మాణాలు ఎప్పుడు ముందుకు సాగుతాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో లబ్ధిదారులు ఉన్నారు.

కాలనీలో ఇటుకల తయారీ యూనిట్‌

ఈనాడు గుంటూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు