logo

లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాల్సిందే

సమయపాలనతో పదోతరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ సూచించారు.

Published : 06 Feb 2023 05:33 IST

మాట్లాడుతున్నలక్ష్మీనారాయణ

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: సమయపాలనతో పదోతరగతి విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ సూచించారు. ఆదివారం ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ, ఏపీ ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పరీక్షల పట్ల ఆందోళన అవసరం లేదన్నారు. నిర్ధేశించుకున్న లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించాల్సిందేనని, సులువైన దారులేమీ ఉండవని గుర్తించాలని చెప్పారు. సినీ హీరోలను కాకుండా జాతీయ నాయకుల త్యాగాలు గురించి తెలుసుకోవాలన్నారు. సెల్‌ ఫోన్‌, టీవీలకు దూరంగా ఉండి పరీక్షలపైనే దృష్టి కేంద్రీకరిస్తే తప్పక విజయం చేకూరుతుందన్నారు. విద్యార్థులు జ్ఞాపకశక్తి, చురుకుదనం పెంపొందించుకోవడం కోసం ఆయన కొన్ని సూచనలు చేశారు. మరో అతిథి, అవధాని మాడుగుల నాగఫణిశర్మ మాట్లాడుతూ యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి క్రియలతో ఏకాగ్రత పెంచుకోవచ్చన్నారు. సభకు రెడ్‌క్రాస్‌ జిల్లా ఉపాధ్యక్షులు పి.రామచంద్రరాజు అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ప్రైవేటు స్కూల్స్‌  అసోసియేషన్‌ నాయకులు మేకల రవీంద్రబాబు పర్యవేక్షించారు. రెడ్‌ క్రాస్‌ యూత్‌ సమన్వయకర్త ఎస్‌వీఎస్‌ లక్ష్మీనారాయణ, మాస్టర్‌మైండ్స్‌ డైరెక్టర్‌ మట్టుపల్లి మోహన్‌, ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు సీహెచ్‌.శ్రీహరి, కార్యదర్శి తేజ సురేష్‌, కోశాధికారి వి.శ్రీనివాస్‌, ఎన్‌.రాజేష్‌, ఎం.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని