logo

సీపీఎస్‌ రద్దు కోరుతూ సంకల్ప దీక్ష

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులను మోసం చేశారని జె.వినయ్‌కుమార్‌ అన్నారు.

Published : 06 Feb 2023 05:33 IST

సంకల్ప దీక్ష చేస్తున్న యూటీఎఫ్‌ నేతలు

బాపట్ల: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకుండా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులను మోసం చేశారని జె.వినయ్‌కుమార్‌ అన్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ స్థానిక యూటీఎఫ్‌ కార్యాలయంలో నేతలు ఆదివారం సంకల్పదీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. విజయవాడ సమీపంలోని ధర్మస్థలి వద్ద యూటీఎఫ్‌ దీక్షను పోలీసులు అడ్డుకుని నేతలను అరెస్టు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీపీఎస్‌ రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సకాలంలో జీతాలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందన్నారు. ప్రతి నెలా 1నే ఉద్యోగులకు జీతాలు చెల్లించాలన్నారు. యూటీఎఫ్‌ నేతలు భిక్షాలుబాబు, హరిప్రియ, సురేష్‌, శాంతారావు, బాపయ్య, కోటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని