logo

చట్ట విరుద్ధ ఫోన్‌ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయవచ్చు

చట్ట వ్యతిరేకంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని భావిస్తే ‘రైట్‌ టు ప్రైవసీ’కి భంగం కలిగినట్లు ఫిర్యాదు చేసి విచారణ కోరవచ్చని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ తెలిపారు.

Published : 06 Feb 2023 05:33 IST

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: చట్ట వ్యతిరేకంగా ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని భావిస్తే ‘రైట్‌ టు ప్రైవసీ’కి భంగం కలిగినట్లు ఫిర్యాదు చేసి విచారణ కోరవచ్చని సీబీఐ మాజీ జేడీ వి.వి.లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం గుంటూరులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. చట్ట వ్యతిరేకంగా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ గురించి పోలీస్‌ స్టేషన్‌లోగాని, హైకోర్టులోగానీ, మానవ హక్కుల కమిషన్‌లోగాని ఫిర్యాదు చేయవచ్చన్నారు. టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, మన దేశానికి ఇతర దేశాలతో సంబంధాలకు విఘాతం కలిగించడానికి యత్నిస్తున్నట్లు తెలిస్తే ఫోన్‌ ట్యాప్‌ చేయడానికి చట్టం పోలీసులకు అవకాశం ఇచ్చిందన్నారు. అలా కాకుండా నిబంధనలు అతిక్రమించి ట్యాపింగ్‌ చేస్తే చట్ట వ్యతిరేకంగా భావిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. నా ఆశయాలకు ప్రాధాన్యం ఇచ్చి ఏ పార్టీ అయినా మాట్లాడితే ముందుకు వెళ్తానన్నారు. లేని పక్షంలో స్వతంత్రంగా నిలబడే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని