logo

కాపరికి మత్తు మందిచ్చి.. మేకలను అపహరించి..

కృష్ణానది పరివాహక ప్రాంతంలో పశువుల కాపరిపై దాడిచేసి, నలభై మేకలను అపహరించిన సంఘటన కొల్లిపర మండల పరిధిలో చోటు చేసుకుంది.

Published : 06 Feb 2023 05:32 IST

కొల్లిపర, న్యూస్‌టుడే: కృష్ణానది పరివాహక ప్రాంతంలో పశువుల కాపరిపై దాడిచేసి, నలభై మేకలను అపహరించిన సంఘటన కొల్లిపర మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు మున్నంగి గ్రామానికి చెందిన పశవులకాపరి కృష్ణారావుపై 4గురు వ్యక్తలు దాడికి పాల్డడ్డారని, బాధితునికి మత్తు ఇంజక్షన్‌ చేసి రూ.2 లక్షల విలువైన మేకలు తరలించుకెళ్లారు. చీకటి పడుతున్నా కృష్ణారావు ఎంతకీ ఇంటికి రాలేదు. దీంతో  కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతుకులాడారు. చేతులుకట్టి, స్పృహలోలేని అతన్ని   గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకుని సరిహద్దుపై ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకున్న పోలీసులు బాధితుని ఫిర్యాదు మేరకు రాత్రి కేసు నమోదు చేశామని కొల్లిపర ఎసై రవీంద్రారెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని