logo

జలుబు... దగ్గు... టైఫాయిడ్‌

ప్రాథమిక వైద్య-ఆరోగ్య కేంద్రాలకు ఇప్పటి వరకు అత్యధికం దగ్గు, జలుబు కేసులు రాగా ప్రస్తుతం టైఫాయిడ్‌ రోగులు వస్తున్నారు.

Published : 07 Feb 2023 06:02 IST

పీహెచ్‌సీల్లో నమోదవుతున్న కేసులివే

చికిత్స కోసం వచ్చిన రోగులు

ఈనాడు-అమరావతి: ప్రాథమిక వైద్య-ఆరోగ్య కేంద్రాలకు ఇప్పటి వరకు అత్యధికం దగ్గు, జలుబు కేసులు రాగా ప్రస్తుతం టైఫాయిడ్‌ రోగులు వస్తున్నారు. టైఫాయిడ్‌ సోకిన వారిలో బ్యాక్టీరియా ముదిరితే కొంచెం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ప్రతి పీహెచ్‌సీ పరిధిలో గడిచిన నెల రోజుల నుంచి పరిశీలిస్తే సగటున రోజూ 3 కేసుల దాకా ఇవే ఉన్నాయని వైద్యులు తెలిపారు.
కలుషిత నీళ్లు తాగటం, అపరిశుభ్ర వాతావరణంలో వండివార్చిన ఆహార పదార్థాలు తీసుకోవటం, రహదారుల వెంబడి ఈగలు, దోమలు వాలిన జంకుఫుడ్స్‌ వంటివి ఎక్కువగా తిన్నవారిలోనే టైఫాయిడ్‌ లక్షణాలు బయటపడుతున్నాయి.  జ్వరం వచ్చిన వెంటనే టైఫాయిడ్‌గా అనుమానించి రక్త పరీక్ష చేయించుకుంటే ఫలితం ఉండదు. జ్వరం వచ్చిన నుంచి కనీసం ఐదారు రోజులు వేచి చూశాక రక్త పరీక్షలు చేయించుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి లేనివారిలోనే బ్యాక్టీరియా చేరి వ్యాధిబారిన పడేలా చేస్తోంది ఉమ్మడి గుంటూరు జిల్లాలో 117 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పటి దాకా ఒక్క మరణం సంభవించలేదని వైద్యులు వివరించారు. ప్రస్తుతం మిర్చి, పత్తి కోతలు, ఇతర వాణిజ్య పంటల దిగుబడులు చేతికి రావటంతో చాలా మంది పొలాల్లో ఉంటున్నారు. కాల్వలు, చెరువుల్లో ప్రవహించే నీళ్లు తాగటం వల్ల కూడా కేసులు రావటానికి ఓ కారణం. జ్వరపీడితులు బహిరంగ మల, మూత్ర విసర్జన చేయరాదని  గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలోని నాన్‌ కమ్యునికబుల్‌ డిసీజస్‌ వైద్యుడు డాక్టర్‌ శ్రావణ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని