logo

కదం తొక్కిన అంగన్‌వాడీ కార్యకర్తలు

సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కారు.

Published : 07 Feb 2023 06:02 IST

నినాదాలు చేస్తున్న అంగన్‌వాడీలు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. ఇందుకు పెద్ద ఎత్తున అంగన్‌వాడీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్బంగా నిర్వహించిన సభలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. . ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు అనేక హామీలు ఇచ్చిందని, వాటిని తక్షణం అమలు చేయాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలను ఫుడ్‌ కమిషన్‌ పేరుతో వేధిస్తున్నారని, ఈ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. హెల్పర్ల పదోన్నతులకు వయోపరిమితి 50 సంవత్సరాలుగా పెంచాలని, అదనంగా హెల్పర్‌లను నియమించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో వినియోగించే గ్యాస్‌కు సంబంధించి డబ్బులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు వై.నేతాజీ మాట్లాడుతూ సంపూర్ణ పోషణ మెనూకు తగిన విధంగా ఛార్జీలను పెంచాలని డిమాండ్‌ చేశారు. వీరికి బీఎల్‌వో విధులను బలవంతంగా వేయవద్దని కోరారు. అనంతరం కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డికి వినతిపత్రం అందించారు ధర్నాలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ, నాయకులు రాధ, కె.శ్రీనివాసరావు, బి.లక్ష్మణరావు, సంఘ జిల్లా కార్యదర్శి దీప్తి మనోజ, సుకన్య, సరళ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని