logo

‘జీతాలందక ఇబ్బంది పడుతున్నాం’

ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంకా చాలామంది 6వ తేదీ వచ్చినా జీతాలందక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ చాంద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 07 Feb 2023 06:02 IST

ప్రసంగిస్తున్న సయ్యద్‌ చాంద్‌బాషా

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే:  ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇంకా చాలామంది 6వ తేదీ వచ్చినా జీతాలందక ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ చాంద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం సయ్యద్‌ చాంద్‌బాషా మీడియాతో మాట్లాడుతూ సుమారు 40 శాతం మంది ఉద్యోగులు, పింఛనుదారులకు ఇంకా జీతభత్యాలు అందలేదన్నారు. దీనివల్ల వీరంతా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేసే ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మార్చి నెల నుంచైనా జీతాలు, పింఛన్లు ఒకటో తేదీనే ఇచ్చేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా నిర్వాహక కార్యదర్శి కరిముల్లా షాఖాదరి, నగర శాఖ అధ్యక్షుడు నాగేశ్వరరావు, పింఛనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మత్తయ్య తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని