logo

Andhra News: వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. వైకాపా నాయకుడికి భార్య దేహశుద్ధి

వివాహేతర సంబంధం నెరుపుతున్న భర్తకు భార్య దేహశుద్ధి చేసిన ఘటన బెల్లంకొండలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామస్థుల వివరాల మేరకు.. బెల్లంకొండకు చెందిన వైకాపా గ్రామ అధ్యక్షుడు గుర్రాల షేక్‌ కరిముల్లా అలియాస్‌ బడాబాచ్చా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

Updated : 25 Feb 2023 08:18 IST

బెల్లంకొండ, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధం నెరుపుతున్న భర్తకు భార్య దేహశుద్ధి చేసిన ఘటన బెల్లంకొండలో శుక్రవారం సాయంత్రం జరిగింది. గ్రామస్థుల వివరాల మేరకు.. బెల్లంకొండకు చెందిన వైకాపా గ్రామ అధ్యక్షుడు గుర్రాల షేక్‌ కరిముల్లా అలియాస్‌ బడాబాచ్చా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యను నిత్యం మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తుండటంతో ఆమె కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటోంది. శుక్రవారం భర్త ఇంటికి తన బంధువుతో వచ్చి న్యాయం చేయాలని కోరింది. దీంతో ఆగ్రహించిన వైకాపా నాయకుడు ఆమెను దుర్భాషలాడటంతో ఆగ్రహానికి గురై భర్తకు దేహశుద్ధి చేసింది. విషయం తెలుసుకున్న ఎస్సై అమీర్‌ సిబ్బందిని పంపి గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని