logo

ఉప్పు కరిగి.. అన్నదాత గుండె చెదిరి

దు రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలు ఉప్పు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. వరుణుడి ధాటికి సుమారు వెయ్యి ఎకరాల్లో 40 వేల క్వింటాళ్ల ఉప్పు కరిగింది.

Published : 21 Mar 2023 05:21 IST

వర్షానికి రూ.1.20 కోట్ల నష్టం

వర్షాలకు మడుల్లో కరిగిన ఉప్పు

చినగంజాం, న్యూస్‌టుడే: ఐదు రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలు ఉప్పు రైతులకు తీరని నష్టాన్ని కలిగించాయి. వరుణుడి ధాటికి సుమారు వెయ్యి ఎకరాల్లో 40 వేల క్వింటాళ్ల ఉప్పు కరిగింది. దాదాపు రూ.1.20 కోట్ల నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పుమడుల్లో నిల్వ ఉన్న వర్షపు నీరుతో మరో నాబు (మరో ఉప్పు తీత)కు ఆటంకం కలిగింది. ప్రస్తుతం క్వింటా ఉప్పుకు రూ.300 ధర పలుకుతోంది. తీతలు తీయాల్సిన మార్చి నెలలో వానలు పడటం దారుణమని కర్షకులు వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని పంట నష్టం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఎకరానికి రూ.12 వేల నష్టపోయా..: మేడికొండ ఏసయ్య, చినగంజాం నేను ఎకరం ఉప్పు కొఠారులను రూ.20 వేలకు కౌలుకు తీసుకొని సాగు చేశాను. ఎకరానికి కొఠారు మడుల నుంచి ఉప్పును తీయనున్న దశలో ఐదు రోజులుగా వర్షం కురుస్తోంది. దీని కారణంగా మొదటి రోజు మడుల్లో పదిశాతం ఉప్పు కరిగింది. తీయాల్సిన 40 బస్తాల నాబు దెబ్బతిన్నాయి. ప్రస్తుత ధర ప్రకారం రూ.12 వేలు నష్టపోయాను. అప్పు చేసి సాగు చేశాను. మొత్తం వర్షానికి కరిగిపోయింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని