logo

అనధికార విద్యుత్తు వినియోగదారులపై క్రిమినల్‌ కేసులు

అంతరాయం లేని.. నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని ట్రాన్స్‌కో ఒంగోలు ఎస్‌ఈ కేవీజీ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణం రామ్‌నగర్‌ విద్యుత్తు ఉప కేంద్రం వద్ద సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

Published : 21 Mar 2023 05:21 IST

విద్యుత్తు సిబ్బందితో సమీక్షలో పాల్గొన్నఒంగోలు విద్యుత్తు ఎస్‌ఈ కేవీజీ సత్యనారాయణ

రామ్‌నగర్‌(అద్దంకి), న్యూస్‌టుడే : అంతరాయం లేని.. నాణ్యమైన విద్యుత్తు అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేయాలని ట్రాన్స్‌కో ఒంగోలు ఎస్‌ఈ కేవీజీ సత్యనారాయణ అన్నారు. అద్దంకి పట్టణం రామ్‌నగర్‌ విద్యుత్తు ఉప కేంద్రం వద్ద సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సోమవారం నిర్వహించిన సమావేశానికి అద్దంకి విద్యుత్తు ఈఈ నల్లూరి మస్తాన్‌రావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌ఈ మాట్లాడుతూ అద్దంకి విద్యుత్తు డివిజన్‌ పరిధిలో 23, 195 విద్యుత్తు సర్వీసుల నుంచి సుమారు రూ.14 కోట్ల బకాయిలు పేరుకున్నాయని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్ని పంచాయతీ సర్పంచుల ద్వారా జమ అయ్యేలా చూడాలని తెలిపారు. బకాయిలు చెల్లించకుండా విద్యుత్తు వినియోగించే వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని హెచ్చరించారు. విద్యుత్తు శాఖలో పని చేసే అధికారి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు జవాబుదారీతనం, నైపుణ్యం, నిబద్దత అవసరమని వివరించారు. సకాలంలో మీటర్లకు సీళ్లు వేయడం, బిల్లులు ఇవ్వడంలో అశ్రద్ధ వహించిన ఏడుగురు సిబ్బందిని వెంటనే విధుల నుంచి రిలీవ్‌ చేసినట్లు ఎస్‌ఈ వెల్లడించారు. వీరిలో మేదరమెట్ల-2, సంతమాగులూరు-2, అద్దంకి, జె.పంగులూరు, మార్టూరు నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు చెప్పారు. సమావేశంలో విద్యుత్తు ఏడీఈ టి.సత్యనారాయణ, ఏఈలు బాలకోటేశ్వరరావు, శివప్రసాద్‌, విద్యుత్తు సిబ్బంది పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని