logo

పది సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు ఆమోదం

జిల్లాలో కొత్తగా పది సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు ఆమోదం తెలిపినట్లు జేసీ శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు

Published : 21 Mar 2023 05:21 IST

మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో కొత్తగా పది సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు ఆమోదం తెలిపినట్లు జేసీ శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాపట్ల జిల్లాను పరిశ్రమల కేంద్రంగా అభివృద్ధి చేయటమే లక్ష్యంగా అధికారులు పని చేయాలన్నారు. 218 యూనిట్ల స్థాపనకు అనుమతులు మంజూరు చేశామన్నారు. అద్దంకిలో రూ.11 కోట్లతో మెటల్‌ డోర్స్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయటంపై చర్చించారు. జంపనిలో రూ.10 కోట్లతో అరటిబోదెలు, పట్టు పురుగులు వ్యర్థాలతో వస్త్రాల తయారీ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాలుష్యం లేని కంపెనీలు ఏర్పాటుకు రూ.15 కోట్లతో ప్లాటెడ్‌ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ భవన నిర్మాణ ప్రతిపాదనలపై పరిశీలన చేయాలన్నారు. బాపట్ల, రేపల్లె, చీరాలలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్క్‌ కోసం 25 ఎకరాల భూమి సేకరించాలని చెప్పారు. పరిశ్రమల శాఖ జీఎం మదన్‌మోహన్‌, ఎల్‌డీఎం కృష్ణానాయక్‌, నాబార్డు జీఎం కార్తీక్‌, ఆర్టీవో చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.

పరిశ్రమల స్థాపనకు బ్యాంకర్లు సహకరించాలి: జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు బ్యాంకర్లు రుణాలు అందజేసి సహకరించాలని డీఆర్వో లక్ష్మీ శివజ్యోతి అన్నారు. కలెక్టరేట్లో బ్యాంకర్ల సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1592.20 కోట్ల నిధులు పరిశ్రమలకు మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.645.59 కోట్లు కేటాయించారన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని