logo

కనీస వేతనం కోరుతూ ‘ఆశా’ల ధర్నా

ఆశా కార్యకర్తలకు కనీస వేతనం కింద నెలకు రూ.26 వేలు చెల్లించాలని ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎం.ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు.

Published : 22 Mar 2023 05:26 IST

ధర్నా చేస్తున్న ఆశా కార్యకర్తలు

బాపట్ల, న్యూస్‌టుడే: ఆశా కార్యకర్తలకు కనీస వేతనం కింద నెలకు రూ.26 వేలు చెల్లించాలని ఆశా కార్యకర్తల సంఘం జిల్లా అధ్యక్షురాలు ఎం.ధనలక్ష్మి డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద ఆశా కార్యకర్తలు మంగళవారం ధర్నా చేశారు. ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలపై పని భారం పెరుగుతోందన్నారు. నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ మణిలాల్‌, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ మజుందార్‌ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలపై రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. అక్రమ తొలగింపులు తగదన్నారు. గ్రామ హెల్త్‌ క్లినిక్‌, సచివాలయాల్లో పని చేయించరాదన్నారు. సెలవులు మంజూరు చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీఎంహెచ్‌వో కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. నేతలు వెంకటేశ్వరమ్మ, ఝాన్సీ, రాధ, షకీనా, సువార్త తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు