logo

ఆశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, అదనపు పనిభారాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు.

Published : 22 Mar 2023 05:26 IST

నరసరావుపేట పట్టణంలో ప్రదర్శన చేస్తున్న ఆశావర్కర్లు

నరసరావుపేట అర్బన్‌: ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, అదనపు పనిభారాన్ని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గాంధీపార్కులో సమావేశం నిర్వహించారు. సంఘం నేతలు డి.శివకుమారి, భూలక్ష్మీ మాట్లాడుతూ ఆశావర్కర్ల నియామకాల్లో రాజకీయ జోక్యం పెరిగిందన్నారు. శానిటేషన్‌ కమిటీల ద్వారా నియామకాలు చేయడంతో కష్టపడి పని చేసే వారిని కాదని అధికారపార్టీకి చెందిన వారిని నియమిస్తున్నారన్నారు. అంతేకాకుండా విలేజ్‌ క్లినిక్‌లో సచివాలయాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఉండాలని, ఓపీలకు సంబంధించిన పనులు చేయాలని, ఆశాలకు సంబంధం లేని పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్‌ మాట్లాడుతూ ఆశాల వ్యవస్థ ఏర్పడినపుడు రూ.150 జీతంతో మొదలై ప్రస్తుతం రూ.10వేలకు చేరిందన్నారు. సుప్రీంకోర్టు రూ.26వేలు ఇవ్వాలని ఇచ్చిన తీర్పును సైతం అమలు చేయడం లేదన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఎటువంటి లబ్ధి ఇవ్వడం లేదన్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. హనుమంతారెడ్డి, మస్తాన్‌రెడ్డి, శిలార్‌ మసూద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని