logo

జీఎంసీలో పీజీ సీట్ల పెంపు

గుంటూరు వైద్య కళాశాల సూక్ష్మజీవశాస్త్రం (మైక్రోబయాలజీ) విభాగంలో పీజీ సీట్లు పెంచుతూ జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) జారీ చేసిన ఉత్తర్వులు మంగళవారం కళాశాలకు అందాయి.

Published : 22 Mar 2023 05:26 IST

ఉత్తర్వులను జాహ్నవికి అందజేస్తున్న పద్మావతిదేవి, పక్కన ఉమాజ్యోతి, పరమేశ్వరి

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గుంటూరు వైద్య కళాశాల సూక్ష్మజీవశాస్త్రం (మైక్రోబయాలజీ) విభాగంలో పీజీ సీట్లు పెంచుతూ జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) జారీ చేసిన ఉత్తర్వులు మంగళవారం కళాశాలకు అందాయి. ఆ విభాగంలో బోధనానిపుణులు, మౌలిక వసతులు ఉన్నందున ప్రస్తుతం ఉన్న 4 పీజీ సీట్ల నుంచి 9కి పెంచాలని ప్రిన్సిపల్‌ పద్మావతిదేవి ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. దీంతో గతనెల 21న గుజరాత్‌ నుంచి ఆచార్య గౌరిశంకర్‌ ఆ విభాగాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చారు. ఆయన ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఎన్‌ఎంసీ కమిటీ సభ్యులు అదనంగా ఐదు సీట్లు పెంచేందుకు అనుమతి మంజూరు చేశారు. పీజీ సీట్లు పెంచుతూ ఎన్‌ఎంసీ ఇచ్చిన ఉత్తర్వులను ప్రిన్సిపల్‌ పద్మావతిదేవి ఆ విభాగం అధిపతి జాహ్నవికి అందజేశారు. కార్యక్రమంలో ఉప ప్రిన్సిపల్‌ ఉమాజ్యోతి, ఆచార్య పరమేశ్వరి పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని