logo

వారంలో మూడు రోజులు రాగిజావ

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా వారంలో మూడు రోజుల పాటు విద్యార్థులకు రాగిజావ అందించనున్నట్లు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

Published : 22 Mar 2023 05:26 IST

విద్యార్థులకు రాగిజావ అందిస్తున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి,జడ్పీ ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, చిత్రంలో ఎమ్మెల్సీలు తదితరులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా వారంలో మూడు రోజుల పాటు విద్యార్థులకు రాగిజావ అందించనున్నట్లు కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్‌లోని వీసీ హాలులో విద్యార్థులకు రాగి జావను మంగళవారం అందించారు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాన్ని వర్చువల్‌ ద్వారా వీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సీఎం జగన్‌ విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. మూడున్నర సంవత్సరాల్లో అనేక సంస్కరణలతో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. జిల్లాలోని 1,094 పాఠశాలల్లో 1,17,560 మంది విద్యార్థులకు వారంలో మంగళ, గురు, శనివారాల్లో రాగిజావను అందించనున్నట్లు తెలిపారు. దీనివల్ల పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందుతుందన్నారు. మధ్యాహ్న భోజనం అందిస్తున్న ఏజెన్సీలే దీనిని అందిస్తాయని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర క్రిస్టినా, ఎమ్మెల్సీలు కె.ఎస్‌.లక్ష్మణరావు, మురుగుడు హనుమంతరావు, సహాయ కలెక్టర్‌ శివనారాయణ శర్మ, డీఈవో శైలజ, పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ జి.లక్ష్మి, ఎంఈవో ఖుద్దూస్‌, విద్యార్థులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని