లబ్ధిదారులకు ఎదురు చూపులే..!
జిల్లాలో నిరుపేద వర్గాలకు జగనన్న కాలనీల్లో గృహాలను ప్రభుత్వం మంజూరు చేయగా నిర్మాణాలు కొలిక్కి రావడం లేదు. ఎప్పటికపుడు గృహ ప్రవేశాల తేదీలను నిర్ణయించడం..
గృహ ప్రవేశాలు ఏప్రిల్‌కు వాయిదా
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే : జిల్లాలో నిరుపేద వర్గాలకు జగనన్న కాలనీల్లో గృహాలను ప్రభుత్వం మంజూరు చేయగా నిర్మాణాలు కొలిక్కి రావడం లేదు. ఎప్పటికపుడు గృహ ప్రవేశాల తేదీలను నిర్ణయించడం.. తీరా ఆరోజు వచ్చే నాటికి మరో తేదీకి వాయిదా వేయడం పరిపాటిగా మారింది. ఉగాది పండగ రోజైన మార్చి 22న జిల్లాలో 13,341 గృహాలను నిర్మించి గృహ ప్రవేశాలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. నిర్ణీత గడువు నాటికి ఎక్కువ ఇళ్లను నిర్మించ లేకపోయారు. ఇదే పరిస్థితి ఇతర జిల్లాల్లోనూ ఉండటంతో ఉగాది రోజు గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని ఏప్రిల్ నెలకు వాయిదా వేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పండగ రోజు శుభకర వాతావరణంలో గృహ ప్రవేశాలు చేయాలనే లబ్ధిదారుల ఆశలు నీరుగారిపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు.
జిల్లాలో నిరుపేదలు 63,361 మందికి ప్రభుత్వం గృహాలను మంజూరు చేసింది. ఉగాది నాటికి 13,341 గృహాలను పూర్తి చేయాలని ఫిబ్రవరిలో ప్రభుత్వం ఆదేశించింది. 7,968 గృహాలను అధికారికంగా లక్ష్యం నిర్దేశించినట్లు జిల్లా గృహనిర్మాణ సంస్థ అధికారులు పేర్కొన్నారు. ఎక్కువ గృహాలను లక్ష్యాన్ని నిర్దేశిస్తే వాటిలో 70 శాతం నిర్మాణాలైనా పూర్తి చేస్తారని భావించి సిబ్బందికి అదనంగా గృహాల నిర్మాణాలను పూర్తి చేయాలని చెప్పామంటున్నారు. 7,968 గృహాలకు గాను 7,230 నిర్మాణాలు పూర్తయ్యాయంటున్నారు. మరో 738 పూర్తి చేయాల్సి ఉందంటున్నారు. ఇప్పటికే లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఏప్రిల్ రెండో వారం నుంచి గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించడంతో ఆలోపు వాటి నిర్మాణాలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. మండలానికి జిల్లా అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించి ఆ మండలంలో నిర్మాణాలు పెంచేలా బాధ్యతలు అప్పజెప్పారు. రోజూ ఉదయం 9 గంటలకు టెలీ కాన్ఫరెన్స్, సాయంత్రం వేళల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించి ప్రగతిని సమీక్షిస్తున్నారు. శనివారం ప్రత్యేకంగా హౌసింగ్ డేని నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా సంయుక్త కలెక్టరు రాజకుమారితో పాటు జిల్లా అధికారులు వారికి కేటాయించిన మండలాల్లోని జగనన్న కాలనీల్లో పర్యటిస్తూ లబ్ధిదారులు గృహాలు నిర్మించుకునేలా మాట్లాడుతున్నారు. కేటగిరి-3లో గుత్తేదారులు నిర్మించేలా ఆదేశాలు జారీ చేస్తున్నారు. రోజు వారీగా నిర్మాణాల లక్ష్యాలను నిర్ణయించి ప్రగతి చూపాలని స్పష్టం చేస్తున్నారు.
నేడు గృహ ప్రవేశాలు లేవు
ఉగాదికి గృహ ప్రవేశాలు చేయాలని నిర్ణయించినా వివిధ కారణాలతో వాయిదా పడింది. అధికారికంగా ఎలాంటి గృహ ప్రవేశాలు లేవు. ఏప్రిల్ రెండో వారం నుంచి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గృహ ప్రవేశాల వారోత్సవాలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఉగాది నాటికి 7,968 గృహాల లక్ష్యాన్ని అంతర్గతంగా నిర్ణయించుకున్నాం. 7,230 గృహాలు పూర్తయ్యాయి. మరో 200 గృహాలు ఆన్‌లైన్‌లో నమోదు కావాలి. మొత్తంగా 538 ఇళ్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి గృహాల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి జిల్లా యంత్రాంగం మొత్తం భాగస్వాములను చేయడంతో ప్రగతి సాధ్యమవుతోంది. మార్చి నెలాఖరు నాటికి లక్ష్యం మేరకు నిర్మాణాలను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేస్తాం.
సాయినాథ్‌కుమార్, జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
సమస్యలు అడిగితే చెప్పుతో కొడతా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు