logo

అంతర్జాతీయ సదస్సులో ప్రతిభ

వియత్నాంలోని బ్రిటిష్‌ యూనివర్శిటీలో మార్చి 11 నుంచి 14వ తేదీ వరకు ఇంటర్నేషనల్‌ మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ (ఐఎంయూఎన్‌) నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఏపీ ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు.

Published : 22 Mar 2023 05:26 IST

ప్రశంసా పత్రాలను అందుకున్న ఏపీ-ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు

తుళ్లూరు, న్యూస్‌టుడే: వియత్నాంలోని బ్రిటిష్‌ యూనివర్శిటీలో మార్చి 11 నుంచి 14వ తేదీ వరకు ఇంటర్నేషనల్‌ మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ (ఐఎంయూఎన్‌) నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఏపీ ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు యూనివర్సిటీ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. సమకాలీన సామాజిక అంశాలపై వివరణాత్మక డ్రాఫ్ట్‌ కాపీలను తయారు చేసి సమర్పించారని, వివిధ దేశాల నుంచి హాజరైన పలు యూనివర్శిటీల విద్యార్థులతో కలిసి బృంద చర్చల్లో పాల్గొని సత్తా చాటారని పేర్కొన్నారు. బీఎస్సీ కంప్యూటర్స్‌ విద్యార్థి దుర్గాప్రవీణ్‌, ఇంజినీరింగ్‌ విద్యార్థులు వేణుగోపాల్‌, సాత్విక్‌, సుహాన్‌ బెస్ట్‌ కామెంటేటర్లుగా ఎంపికై అంతర్జాతీయ వేదికపై దేశ గొప్పదనాన్ని చాటి చెప్పారని తెలిపారు. సదస్సులో 35 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారని చెప్పారు. విద్యార్థులను ఎస్‌ఆర్‌ఎం-ఏపీ యూనివర్శిటీ ప్రెసిడెంట్‌ సత్యనారాయణన్‌, వైస్‌ ఛాన్సలర్‌ మనోజ్‌కుమార్‌ ఆరోరా, ఇంటర్‌ నేషనల్‌ స్టడీస్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ పసుపులేటి నాగశ్వేత తదితరులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని