logo

సంచాలకులుగా సుమితాశంకర్‌

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిశోధన, అభివృద్ధి విభాగం సంచాలకులుగా ఆచార్య సుమితాశంకర్‌ను ప్రభుత్వం నియమించింది.

Published : 22 Mar 2023 05:26 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం పరిశోధన, అభివృద్ధి విభాగం సంచాలకులుగా ఆచార్య సుమితాశంకర్‌ను ప్రభుత్వం నియమించింది. ఆమె ఏడాది పాటు ఈ పోస్టులో పని చేయనున్నారు. ప్రస్తుతం గుంటూరు సర్వజనాసుపత్రి ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం అధిపతిగా పని చేస్తున్నారు. బోధన, పరిశోధన పట్ల ఆమెకు ప్రత్యేక ఆసక్తి ఉన్నందున ఈ పోస్టుకు ఎంపిక చేశారు. విజయవాడలో నూతన బాధ్యతలు చేపట్టేందుక వీలుగా మంగళవారం సాయంత్రం గుంటూరులో విధుల నుంచి రిలీవయ్యారు. దీంతో ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం అధిపతిగా ఆచార్య భాస్కరరావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ పద్మావతిదేవి ఆదేశాలిచ్చారు. ఇక నుంచి ఆయన పీడియాట్రిక్‌ సర్జరీ విభాగంతో పాటు ప్లాస్టిక్‌ సర్జరీ విభాగాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు