logo

మాజీ సైనికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ

ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు మాజీ సైనికుల వైద్య, ఆరోగ్య కేంద్రాల డిప్యూటీ జనరల్‌ ఆఫీసర్‌ ఇన్‌ కమాండింగ్‌ బ్రిగేడియర్‌ సోమశేఖర్‌ పేర్కొన్నారు.

Published : 22 Mar 2023 05:26 IST

దివ్యాంగుడికి మూడు చక్రాల వాహనాన్ని అందజేస్తున్న బ్రిగేడియర్‌ సోమశేఖర్‌

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నట్లు మాజీ సైనికుల వైద్య, ఆరోగ్య కేంద్రాల డిప్యూటీ జనరల్‌ ఆఫీసర్‌ ఇన్‌ కమాండింగ్‌ బ్రిగేడియర్‌ సోమశేఖర్‌ పేర్కొన్నారు. గుంటూరు శ్యామలనగర్‌లోని మాజీ సైనికుల ఆరోగ్య కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఫార్మసీ కేంద్రాన్ని, ఫిజియోథెరపీ, సందర్శకులు వేచి ఉండే భవనాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేశారు. సోమశేఖర్‌ మాట్లాడుతూ 2004లో మాజీ సైనికుల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. అధునాతన వైద్య సదుపాయాలు, పరికరాలు ఏర్పాటు చేసి సేవలను మరింత విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సైనిక సంక్షేమ శాఖ విశ్రాంత డైరెక్టర్‌ వెంకటరెడ్డి, హవల్దార్‌ పోతురాజు, ఆరోగ్య కేంద్రం పాలనాధికారి కల్నల్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని