logo

గ్రామాల్లో వలసల నివారణకే ‘ఉపాధి’

వలసలు నివారించేందుకు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టిందని డ్వామా పీడీ శంకర్‌నాయక్‌ అన్నారు. ఉపాధి పనులపై ఎంపీపీ అవిశన జ్యోతి అధ్యక్షతన సామాజిక తనిఖీసభ నిర్వహించారు.

Updated : 22 Mar 2023 05:33 IST

ప్రజావేదిక సభలో మాట్లాడుతున్న డ్వామా పీడీ శంకర్‌నాయక్‌

అద్దంకి, న్యూస్‌టుడే : వలసలు నివారించేందుకు ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ప్రవేశ పెట్టిందని డ్వామా పీడీ శంకర్‌నాయక్‌ అన్నారు. ఉపాధి పనులపై ఎంపీపీ అవిశన జ్యోతి అధ్యక్షతన సామాజిక తనిఖీసభ నిర్వహించారు. 2021- 22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 26 పంచాయతీల్లో రూ.7.16 కోట్ల మేర పనులు చేసినట్లు దస్త్రాల్లో నమోదైందని, ఇందులో కూలీలకు వేతనాల రూపంలో రూ.4.23 కోట్లు, మెటీరియల్‌ రూపంలో రూ.2.93 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. తక్కువగా ఖర్చు చేయడంపై మండల స్థాయి సిబ్బందిని ప్రశ్నించారు. చెరుకుపల్లి మండలంలో రూ.9 కోట్లు, చినగంజాంలో రూ.తొమ్మిది కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. 26 పంచాయతీలున్న అద్దంకిలో మాత్రం అతి తక్కువగా రూ.7.12 కోట్లు మాత్రమే ఖర్చు చేయడాన్ని ఆక్షేపించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రద్యుమ్నకుమార్‌, డీవీవో శోభన్‌బాబు, ఏపీడీ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

* పంచాయతీల విద్యుత్తు బిల్లును 15వ ఆర్థిక సంఘం/సాధారణ నిధుల నుంచి చెల్లించాలని పీడీ శంకర్‌నాయక్‌ సూచించారు. మండలంలోని పలువురు సర్పంచులు ఈ విషయమై పీడీకి వినతి పత్రం అందించగా, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు