logo

ఉరేసుకుని కౌలురైతు ఆత్మహత్య

అప్పుల భారంతో కౌలు రైతు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది.

Published : 23 Mar 2023 05:12 IST

కోటేశ్వరరావు (పాతచిత్రం)

గురజాల గ్రామీణ, న్యూస్‌టుడే: అప్పుల భారంతో కౌలు రైతు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కల గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సాగి కోటేశ్వరరావు(50) తన ఎకరం సొంత పొలంతో పాటు రెండేళ్ల నుంచి ఐదెకరాలు కౌలుకు తీసుకుని పండిస్తున్నారు. తెగుళ్లు, వర్షాలతో పంటలు దెబ్బతినడంతో సుమారు రూ.7లక్షల వరకు అప్పులయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం తన భార్యకు పొలం వెళ్లొస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గొట్టిముక్కల శివారులోని ముళ్ల పొదల్లో మధ్యాహ్నం ఉరేసుకుని ఉండటం చూసిన గొర్రెలకాపరి వెంటనే అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. బంధువులు వచ్చి చూడగా చనిపోయి వేలాడుతూ ఉన్నాడు. కోటేశ్వరరావు భార్య చెన్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని