logo

ప్రయోగాత్మక పంటల సేద్యంతో సత్ఫలితాలు

రైతులు మూస ధోరణిలో కాకుండా ప్రయోగాత్మకంగా పంటలను సేద్యం చేసినట్లయతే సత్ఫలితాలు వస్తాయని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

Updated : 23 Mar 2023 05:43 IST

ఉగాది వేడుకల్లో ఆంగ్రూ వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి

ఉగాది పురస్కారాలు పొందిన ఉత్తమ రైతులు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: రైతులు మూస ధోరణిలో కాకుండా ప్రయోగాత్మకంగా పంటలను సేద్యం చేసినట్లయతే సత్ఫలితాలు వస్తాయని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గుంటూరు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం ఆడిటోరియంలో శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఉపకులపతి మాట్లాడుతూ శాస్త్రవేత్తలతో సమానంగా రైతులు కూడా పరిశోధనాత్మకంగా పంటలను సేద్యం చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఉత్తమ రైతులు, ఉపాధ్యాయులుగా ఎంపికయిన పురస్కార గ్రహీతలను వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి జ్ఞాపికలు, దుశ్శాలువాలతో సన్మానించారు. రూ.5 వేల నగదు చెక్కు కూడా అందజేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ జి.రామరావు, విభాగాల అధిపతులు ఎల్‌.ప్రశాంతి, బి.విజయాభినందన, ఎ.మణి, సీహెచ్‌.చిరంజీవి, పి.సాంబశివరావు, ఎ.వి.రమణ, లాంఫాం ఏడీఆర్‌ జి.సుబ్బారావు, అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. 2022-23 ఉత్తమ రైతులు, ఉపాధ్యాయులుగా పురస్కారాలు పొందిన వారి వివరాలివీ.

ఉత్తమ ఉపాధ్యాయులతో ఆంగ్రూ వీసీ విష్ణువర్ధన్‌రెడ్డి

ఉత్తమ రైతులు: పి.వరాహనరసింహం (శ్రీకాకుళం జిల్లా, సర్బులిజి మండలం, నక్కలపేట), ఎస్‌.రఘునాథ్‌(అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్ట), జి.నాగబాబు (గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడు), ఎల్‌.సదాశివారెడ్డి (వైఎస్‌ఆర్‌ జిల్లా చాపాడు మండలం వెదురూరు రాజుపాలెం), డి.మద్దయ్య (కర్నూలు జిల్లా ఓర్వకల్‌ మండలం సోమయాజులపల్లి).

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలు: డాక్టర్‌ జి.కృష్ణారెడ్డి(తిరుపతి ఎస్‌.వి.వ్యవసాయ కళాశాల సేద్యశాస్త్రం ఆచార్యులు), డాక్టర్‌ డి.సుబ్రహ్మణ్యం(ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం సేద్యశాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త), డాక్టర్‌ పి.సుజాతమ్మ(బనవాసి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త, సేద్య శాస్త్రం ప్రోగ్రాం సమన్వయకర్త), డాక్టర్‌ జి.బిందుమాధవి (ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ సాంకేతిక అధికారి), డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌(మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్యశాస్త్రం ప్రధాన శాస్త్రవేత్త), డాక్టర్‌ పి.కిషోర్‌వర్మ(ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం మొక్కల తెగుళ్ల శాస్త్రం సీనియర్‌ శాస్త్రవేత్త), డాక్టర్‌ జి.వి.సునీల్‌కుమార్‌(ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ  సీనియర్‌ శాస్త్రవేత్త కీటకశాస్త్రం). 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని