logo

ఇది మినీ వ్యానా.. బస్సా!

పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు పరుగెడుతున్నాయి. ఏమాత్రం వాహనం అదుపు తప్పినా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకునే వారు కరవయ్యారు.

Published : 23 Mar 2023 05:12 IST

వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలో కిక్కిరిసిన ప్రయాణికులతో వాహనం

పర్చూరు, న్యూస్‌టుడే: పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు పరుగెడుతున్నాయి. ఏమాత్రం వాహనం అదుపు తప్పినా పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకునే వారు కరవయ్యారు. వాడరేవు-పిడుగురాళ్ల రహదారిలో మినీ వ్యానులో ఎక్కిన ప్రయాణికులను గమనిస్తే ‘ఇంత మంది ఎలా సాధ్యం’ అనే అనుమానం కలగకమానదు. ప్రధాన రహదారిలో పెద్ద సంఖ్యలో పరిమితికి మించి ప్రయాణికులతో వాహనాలు వెళుతున్నా అధికారుల తనిఖీలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రమాదాలు జరిగిన తర్వాత హడావుడి చేసే బదులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని