logo

ఇళ్లున్నాయ్‌.. నీళ్లే కరవు

బాపట్ల ప్యాడిసన్‌పేట జగనన్న కాలనీలో నీటి వసతి లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు - రేపల్లె జాతీయ రహదారి పక్కనే ఈ కాలనీ ఉండడంతో లబ్ధిదారులు ముందుకు వచ్చి ఇళ్ల నిర్మాణం  పూర్తి చేసుకున్నారు

Published : 28 Mar 2023 05:48 IST

బాపట్ల ప్యాడిసన్‌పేట జగనన్న కాలనీలో నీటి వసతి లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒంగోలు - రేపల్లె జాతీయ రహదారి పక్కనే ఈ కాలనీ ఉండడంతో లబ్ధిదారులు ముందుకు వచ్చి ఇళ్ల నిర్మాణం  పూర్తి చేసుకున్నారు. ఇప్పటికే వందకు పైగా కుటుంబాలు ఈ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని లబ్ధిదారుల వెంటపడిన అధికారులు ఈ కాలనీలో శాశ్వత నీటి పథకం నిర్మాణ పనులకు చొరవ చూపలేదు. ఇప్పటికీ డీపీఆర్‌ దశలోనే ఉన్న పనులకు ఎప్పుడు టెండర్లు పిలుస్తారో పనులు ఎప్పుడు మొదలవుతాయో తెలియని పరిస్థితి. ప్రస్తుతం వారానికి ఒకసారి మాత్రమే వచ్చే నీటి ట్యాంకర్లే ఈ కాలనీ వాసులకు ఆధారం. ట్యాంకర్లు వచ్చినప్పుడు నీటిని నింపుకొనేందుకు ప్రతి ఇంటి ముందూ ఇలా డ్రమ్ములు సిద్ధంగా ఉంచుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న లబ్ధిదారులు ఇంటి పనులకు నీరు చాలక మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉండే అవకాశం ఉందని, అధికారులు తమకు శాశ్వత నీటి పథకం ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
 ఈనాడు, బాపట్ల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని