logo

పది పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు

జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు

Updated : 28 Mar 2023 06:44 IST

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఆదేశించారు. ఆమె సోమవారం మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ పటిష్ఠంగా అమలు చేయాలని చెప్పారు. అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా ఇవ్వాలని, ప్రశాంత వాతావరణంలో పరీËక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఔషధాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో 103 పరీక్షా కేంద్రాల్లో 17,344 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఓపెన్‌ స్కూలు పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జేసీ శ్రీనివాసులు, అదనపు ఎస్పీ మహేష్‌, డీఆర్వో లక్ష్మీ శివజ్యోతి, డీఈవో రామారావు, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు, డీపీవో శంకర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు