logo

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీస కరుణ చూపడం లేదని, వారి బాధలను ఆలకించేందుకే వచ్చినట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Published : 28 Mar 2023 05:57 IST

పరామర్శిస్తున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులు

నగరపాలకసంస్థ (గుంటూరు), న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీస కరుణ చూపడం లేదని, వారి బాధలను ఆలకించేందుకే వచ్చినట్లు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల పలు సమస్యల పరిష్కారానికి చేస్తున్న పోరాటం సోమవారంతో 19వ రోజుకు చేరింది. కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలను ఆయన సోమవారం పరామర్శించారు. శ్రీనగర్‌ 7వ లైన్‌లోని కుటుంబాన్ని ఆయనతో పాటు జనరల్‌ సెక్రటరీ పలిశెట్టి దామోదర్‌, జిల్లా అధ్యక్షుడు కనపర్తి సంగీతరావు, కార్యదర్శి కిరణ్‌కుమార్‌ పలకరించి మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చే వరకు అండగా ఉంటామని ప్రమాణం చేశారు. ఉద్యోగులు తమ కుటుంబంలో భాగమని చెబుతున్న ప్రభుత్వం, వారికి కష్టమొస్తే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కుటుంబ పెద్ద అర్ధంతరంగా చనిపోతే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయా కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని డిమాండు చేశారు. ఆర్టీసీలో అయిదు, ఇతర శాఖలకు సంబంధించిన రెండు కుటుంబాలను ఏపీ జేఏసీ అమరావతి నాయకులు పరామర్శించారు. కార్యక్రమంలో ఏపీ హెచ్‌ఎం సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, నాలుగో తరగతి ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లేశ్వరరావు, వీఆర్వో సంఘం రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు