logo

‘విద్యుత్తు శాఖ పక్షపాతంగా వ్యవహరిస్తోంది’

సిటీకేబుల్‌ ఆపరేటర్లపై విద్యుత్తు శాఖ అధికారులు పక్షపాతం చూపుతున్నారని సిటీ కేబుల్‌ ఆపరేటర్లు సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

Published : 28 Mar 2023 06:03 IST

వేణుగోపాల్‌రెడ్డికి సమస్య వివరిస్తున్న సిటీ కేబుల్‌ ఆపరేటర్లు

నగరంపాలెం, న్యూస్‌టుడే: సిటీకేబుల్‌ ఆపరేటర్లపై విద్యుత్తు శాఖ అధికారులు పక్షపాతం చూపుతున్నారని సిటీ కేబుల్‌ ఆపరేటర్లు సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా సిటీకేబుల్‌ ఆపరేటర్లు మాట్లాడుతూ విద్యుత్తు స్తంభాలకు వివిధ నెట్‌వర్కులకు సంబంధించిన కేబుల్స్‌ ఉన్నప్పటికీ కేవలం సిటీ కేబుల్‌ తీగలను మాత్రమే ఆ శాఖ అధికారులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్‌ వైర్లు కత్తిరించిన కారణంగా మూడు రోజులుగా ప్రసారాలు నిలిచిపోయి వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేబుల్‌ వైర్ల పునరుద్ధరణ కోసం వెళ్లిన వారిని సైతం అక్రమ కేసులతో పోలీస్‌ స్టేషన్లకు తీసుకువెళ్తున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు. దీనికి స్పందించిన కలెక్టర్‌ ఆ శాఖ అధికారులను వివరణ కోరారు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేబుల్‌ వైర్లను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో నెలకొన్న కేబుల్‌ వివాదంపై కలెక్టర్‌, ఎస్పీ సానుకూలంగా స్పందించడంపై సిటీ కేబుల్‌ ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని