స్పందనలో స్పృహ కోల్పోయిన వృద్ధురాలు
పోలీసు కార్యాలయంలో సోమవారం ఓ వృద్ధురాలు స్పృహ కోల్పోవడం ఆందోళన రేకెత్తించింది. తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన వడ్లమూడి సీతామహాలక్ష్మి భర్త రంగారావు మృతి చెందారు.
సీతామహాలక్ష్మిని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న పోలీసులు
గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: పోలీసు కార్యాలయంలో సోమవారం ఓ వృద్ధురాలు స్పృహ కోల్పోవడం ఆందోళన రేకెత్తించింది. తెనాలి మండలం అంగలకుదురుకు చెందిన వడ్లమూడి సీతామహాలక్ష్మి భర్త రంగారావు మృతి చెందారు. ఆమెకు భర్త తరపున వట్టిచెరుకూరు మండలంలోని వింజనపాడులో ఎకరం పొలం ఉంది. దాన్ని తనకు తెలియకుండా బంధువులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బంధువులు తనపై దౌర్జన్యం చేస్తూ బెదిరిస్తున్నారంటూ ఎస్పీ స్పందన కార్యక్రమంలో అనేకసార్లు విన్నవించారు. సోమవారం మళ్లీ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఫిర్యాదు అందించారు. స్పందించిన ఆయన తెనాలి పోలీసులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. అంతలో స్పృహ తప్పి పడిపోవడంతో ఎస్సై మీరావలి, హెడ్ కానిస్టేబులు జానయ్య మహిళా సిబ్బందితో కలిసి 108లో జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
MS Dhoni: ధోని మోకాలి శస్త్రచికిత్స విజయవంతం..!
-
India News
Gold Smuggling: ఆపరేషన్ గోల్డ్.. నడి సంద్రంలో 32 కేజీల బంగారం సీజ్
-
General News
Top Ten News @ 9PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Wrestlers Protest: రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం.. రైతు సంఘాలు
-
Movies News
Sobhita Dhulipala: మోడలింగ్ వదిలేయడానికి అసలైన కారణమదే: శోభితా ధూళిపాళ్ల
-
Politics News
Balineni: పార్టీలోని కొందరు కావాలనే ఇబ్బంది పెట్టారు.. సీఎంతో భేటీ అనంతరం బాలినేని