logo

వైద్య వృత్తిలో రోగులే అధ్యాపకులు

సమాజంలో వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ కోరుకొండ బాబ్జీ అన్నారు.

Published : 28 Mar 2023 06:10 IST

మాట్లాడుతున్న వీసీ బాబ్జీ

మంగళగిరి, న్యూస్‌టుడే: సమాజంలో వైద్య వృత్తి చాలా పవిత్రమైనదని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ కోరుకొండ బాబ్జీ అన్నారు. మంగళగిరి పరిధి చినకాకానిలోని ఎన్నారై మెడికల్‌ కళాశాలలో 2017-23 విద్యా సంవత్సరంలో వైద్య విద్య పూర్తి చేసిన 142 మంది విద్యార్థులకు సోమవారం రాత్రి డిగ్రీ పట్టాల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చెప్పినట్టు లక్ష్యాన్ని నిర్ధేశించుకొని దానిని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. లక్ష్య సాధనలో నిరుత్సాహానికి గురికావద్దని, ఎప్పుడూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండాలని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 17 వైద్య కళాశాలలు రాబోతున్నాయని వెల్లడించారు. వైద్య విద్యకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉందన్నారు. ‘వృత్తి నిర్వహణలో మీ వద్దకు వచ్చే రోగులే మీకు అధ్యాపకులు. వారిని నిర్లక్ష్యం చేస్తే నేర్చుకోవడం ఆగిపోతుంది. మీవద్దకు వచ్చేవారిని గౌరవించండి. ఎదుటివారితో పాటు మీ తల్లిదండ్రులను గౌరవించడం కూడా నేర్చుకోండి. గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉన్నందున సమాజం పట్ల ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి’ అని సూచించారు. కార్యక్రమంలో ఎన్నారై అడ్మినిస్ట్రేటర్‌ మండవ విష్ణువర్థనరావు, ప్రిన్సిపల్‌ శ్రీమతిలక్ష్మి, మెడికల్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ చౌదరి, వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రబోద్‌, పీజీ వైస్‌ ప్రిన్సిపల్‌ ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని