కీచక మావయ్య!
కుమార్తెలా చూసుకోవాల్సిన మావయ్య తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, అంధురాలైన తనను కోరిక తీర్చమంటూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ ప్రత్తిపాడు మండలానికి చెందిన బాధితురాలు తన భర్తతో కలిసి సోమవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు.
దివ్యాంగ కోడలిపై లైంగిక వేధింపులు
ఎస్పీకి బాధిత మహిళ ఫిర్యాదు
నెహ్రూనగర్ (గుంటూరు), న్యూస్‌టుడే: కుమార్తెలా చూసుకోవాల్సిన మావయ్య తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, అంధురాలైన తనను కోరిక తీర్చమంటూ చిత్రహింసలు పెడుతున్నాడంటూ ప్రత్తిపాడు మండలానికి చెందిన బాధితురాలు తన భర్తతో కలిసి సోమవారం పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆరిఫ్ హఫీజ్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన విచారించి బాధితురాలికి న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి ఆవేదన ఆమె మాటల్లోనే.. ‘నాకు చిన్నతనం నుంచి రెండు కళ్లు కనిపించవు. అంధురాలి పింఛను వస్తుంది. 13 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. భర్త ప్రైవేటు ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. మాకు ఒక బాబు. వివాహమైన కొద్ది రోజుల నుంచే మావయ్య అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఈ విషయం భర్తకు చెబితే, ఆయన తన తండ్రిని మందలించారు. అయినా అతని తీరులో మార్పు రాలేదు. తన కోరిక తీర్చమంటూ వేధించేవాడు. పెద్ద మనుషుల ముందు పంచాయితి పెడితే, తాను అలా ప్రవర్తించ లేదంటూ నటించేవాడు. ఇటీవల నా భర్త ఇంట్లో లేని సమయంలో నా ఇద్దరు అత్తలు నన్ను బలవంతంగా పట్టుకోగా, మావయ్య అఘాయిత్యానికి యత్నించాడు. మనస్తాపంతో నేను పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించా. చివరికి భరించలేక పోలీసు కేసు పెట్టాం. అప్పటి నుంచి మావయ్య వాళ్లు అదే వీధిలో వేరే ఉంటున్నా, వేధింపులు మానలేదు. నాతో పాటు నా భర్తపై వేరే వ్యక్తులతో దాడి చేయిస్తున్నాడు. అదేమంటే కేసు వెనక్కి తీసుకోవాలని, తన కోరిక తీర్చాలని, లేకపోతే మమ్మల్ని అంతం చేయిస్తానని బెదిరిస్తున్నాడు. వారిపై చర్యలు తీసుకొని మాకు ప్రాణరక్షణ కల్పించాలి.’
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!