logo

అనిశా వలలో సర్వేయర్‌

కర్లపాలెం మండల పరిధిలో బుధవారం ఓ సచివాలయ సర్వేయర్‌ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు దాడి చేసి పట్టుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

Published : 30 Mar 2023 05:29 IST

రూ.26 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

లంచం సొమ్ముతో సీతా హేమంత్‌

కర్లపాలెం, న్యూస్‌టుడే: కర్లపాలెం మండల పరిధిలో బుధవారం ఓ సచివాలయ సర్వేయర్‌ లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు దాడి చేసి పట్టుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. అనిశా డీఎస్పీ టీవీవీ ప్రతాప్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. దుండివారిపాలెం గ్రామ సచివాలయ సర్వేయర్‌ సీతా హేమంత్‌ యాజలి సచివాలయ ఇన్‌ఛార్జి సర్వేయర్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాకుమాను మండలం రేటూరుకు చెందిన వెంకయ్యకు యాజలి సచివాలయ పరిధిలో వ్యవసాయ భూమి ఉంది. పొలం సర్వే కోసం ఈనెల 21న దరఖాస్తు చేయగా సర్వేయర్‌ 24న సర్వే చేశారు. ఈనెల 25న వెంకయ్య ధ్రువపత్రం కోసం సర్వేయర్‌ను సంప్రదించగా రూ.26 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు అంత నగదు చెల్లించుకోలేక అనిశా అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బాధితుడు సర్వేయర్‌కు రూ.26 వేలు లంచం ఇస్తుండగా సిబ్బందితో కలిసి బుధవారం దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడిని విజయవాడ అనిశా కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వివరించారు. ప్రభుత్వ అధికారులెవరైనా లంచం అడిగితే 14400 యాప్‌, స్పందన కాల్‌ సెంటరుకు ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని సూచించారు. అనిశా సీఐలు రవిబాబు, నాగరాజు, అంజిబాబు, మన్మథరావు, ఎస్సై శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

వివరాలు వెల్లడిస్తున్న అనిశా డీఎస్పీ ప్రతాప్‌కుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని