logo

ఈ రహదారికి మోక్షమెప్పుడు?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు మండలం త్రోవగుంట నుంచి కృష్ణా జిల్లా దిగుమర్రు వరకు జాతీయ రహదారిని విస్తరించారు. ఈక్రమంలో మలుపులు లేని రహదారిని గ్రామాల బయట నుంచి రోడ్డు నిర్మించారు.

Published : 30 Mar 2023 05:29 IST

22 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులకు రూ.19.8 కోట్లతో అంచనాలు
మూడేళ్లు దాటినా మంజూరు కాని నిధులు
చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే

ఈపూరుపాలెం పోతురాజు శిల వద్ద ప్రధాన రహదారిపై గుంత

మ్మడి ప్రకాశం జిల్లాలో ఒంగోలు మండలం త్రోవగుంట నుంచి కృష్ణా జిల్లా దిగుమర్రు వరకు జాతీయ రహదారిని విస్తరించారు. ఈక్రమంలో మలుపులు లేని రహదారిని గ్రామాల బయట నుంచి రోడ్డు నిర్మించారు. ఈ సమయంలో త్రోవగుంట, మద్దిరాలపాడు, చదలవాడ, ఉప్పుగుండూరు, చినగంజాం, కడవకుదురు, పందిళ్లపల్లి, ఈపురుపాలెం ప్రాంతంలో గతంలో జాతీయ రహదారి కింద ఉన్న సుమారు 22 కిలోమీటర్ల మేర మిగిలిన ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత ఆర్‌అండ్‌బీకి అప్పగించారు. ఒంగోలు, చీరాల రహదారులను ఆర్‌అండ్‌బీకి మూడేళ్ల క్రితం ఎన్‌హెచ్‌ అధికారులు బదిలీ చేసినా ఇప్పటికీ వాటి రూపురేఖలు మారలేదు. రహదారులు అధ్వానంగా మారడంతో రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాహన చోదకులు వాపోతున్నారు.

ప్రతిపాదనలు రూపొందించి ఏళ్లు గడుస్తున్నా..

ఈ రహదారులను బాగు చేసేందుకు రూ.16 కోట్లతో అంచనాలు రూపొందించి జాతీయ రహదారి అధికారులకు పంపారు. అయినా నిధులు మంజూరు కాలేదు. దీనిపై ఆర్‌అండ్‌బీ అధికారులు వీరితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతున్నా వారి నుంచి స్పందన కానరాలేదు. ఈలోగా రేట్లు మారిపోవడంతో మరలా కొత్తగా రూ.19.8 కోట్లతో తిరిగి అంచనాలు తయారు చేసి పంపారు. ఇవి పంపి కూడా ఏడాదిపైనే గడుస్తోంది. అయినా నిధులు మంజురు కాలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిధులు మంజూరుకు చర్యలు చేపట్టి రోడ్లు మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


రెండుసార్లు అంచనాలు పంపాం

- ఎం.నరసింహులు, డీఈ, ఆర్‌అండ్‌బీ చీరాల

ఈ రహదారులు బాగు చేసేందుకు ఇప్పటి వరకు రెండుసార్లు అంచనాలు తయారు చేసి ఎన్‌హెచ్‌ అధికారులకు పంపాం. అయినా నిధులు మంజూరు కాలేదు. ఈపురుపాలెం కొత్త కాలువ వంతెనకు ముందు రోడ్డు బాగా దెబ్బతింది. దీన్ని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాహనదారులకు ఇబ్బంది లేకుండా బాగుచేశాం. ఇది జరిగి కూడా ఆరు నెలలపైగా అవుతుంది. నిధులు మంజూరైతే వెంటనే రోడ్డును పునర్నిర్మించేందుకు చర్యలు చేపడతాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని