ఎండిన మొక్కలు.. కూలీల హాజరులో దిద్దుబాట్లు
నాటిన మొక్కలు సగం వరకు ఎండిపోయాయి.. హాజరు పట్టీల్లో సంతకాలు దిద్ది ఉన్నట్లు సామాజిక తనిఖీలో వెలుగు చూశాయి. మండలంలో 2021-22 సంవత్సరానికి ఎనిమిది వేల మంది కూలీలకు
ఉపాధి హామీ సామాజిక తనిఖీలో వెలుగు చూసిన వైనం
వేటపాలెంలో మాట్లాడుతున్న డ్వామా పీడీ శంకర్ నాయక్, పక్కన ఎంపీడీవో శర్మ, విజిలెన్స్ అధికారి శోభన్‌బాబు
వేటపాలెం, కారంచేడు: నాటిన మొక్కలు సగం వరకు ఎండిపోయాయి.. హాజరు పట్టీల్లో సంతకాలు దిద్ది ఉన్నట్లు సామాజిక తనిఖీలో వెలుగు చూశాయి. మండలంలో 2021-22 సంవత్సరానికి ఎనిమిది వేల మంది కూలీలకు 1.87 లక్షల పనిదినాలు కల్పించారు. దీనికోసం రూ.7.76 కోట్లు వ్యయం చేశారు. వీటిల్లో సామగ్రి కింద రూ.4.82 లక్షలు వ్యయం చేశారు. వేటపాలెం, కారంచేడులో బుధవారం నిర్వహించిన సామాజిక తనిఖీ గ్రామసభకు జిల్లా డ్వామా పీడీ శంకర్ నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల్లో చేసిన పనుల వివరాలను సామాజిక తనిఖీ బృంద సభ్యులు వివరించారు. బైపాస్ రోడ్డు వెంట సుమారు 400 మొక్కలు నాటగా వాటిల్లో సగం మాత్రమే బతికి ఉన్నాయన్నారు. వేటపాలెం, అక్కాయిపాలెం ప్రాంతాల్లో కూలీల హాజరు పట్టీల్లో దిద్ది ఉన్నట్లు సామాజిక తనిఖీ రిసోర్స్ పర్సన్లు సభ దృష్టికి తీసుకొచ్చారు. మొక్కలకు నీరు పెట్టే కూలీలు అనారోగ్యం కారణంగా మొక్కలు ఎండిపోయాయని, పనులకు కూలీలు ఆలస్యంగా రావడంతో హాజరు పట్టీలో మళ్లీ వాటిని సరిచేయాల్సి వచ్చిందని ఆయా క్షేత్ర సహాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పీడీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి తప్పులు దొర్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలు ఎండిపోయిన ఘటనలో కూలీలకు వేతనాలు చెల్లింపును నిలుపుదల చేసినట్లు చెప్పారు. కారంచేడు మండలంలో గత ఏడాది 942 పనులు జరగగా రూ.6.87 కోట్ల ఉపాధి నిధులు చెల్లించారు. ఉపాధి హామీ జిల్లా విజిలెన్స్ అధికారి శోభన్‌బాబు, ఎంపీడీవో శర్మ, రామన్నపేట సర్పంచి కందేటి అరుణ, ఏపీవో సుధారాణి సిబ్బంది ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
మీరు సర్వ నాశనం కావాలి
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి
-
World News
Space: ఇకపై అంతరిక్షంలో వ్యోమగాములు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొచ్చు!