logo

మూడో రైల్వేలైన్‌ పనుల పరిశీలన

బాపట్ల జిల్లా చినగంజాం రైల్వేస్టేషన్‌ను సౌత్‌ సెంట్రల్‌, సదరన్‌, సౌత్‌ వెస్ట్రన్‌, సౌత్‌జోన్‌ రైల్వేల కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌, బెంగళూరు) ప్రంజీవ్‌ సక్సేనా బుధవారం పరిశీలించారు.

Published : 30 Mar 2023 05:29 IST

చినగంజాం నుంచి చీరాల వెళ్లిన రైల్వే సీఆర్‌ఎస్‌ ప్రంజీవ్‌ సక్సేనా

నూతనంగా వేసిన మూడోలైన్‌లో ట్రాలీపై వెళుతున్న రైల్వే సీఆర్‌ఎస్‌ ప్రంజీవ్‌ సక్సేనా

చినగంజాం, చీరాల, వేటపాలెం, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా చినగంజాం రైల్వేస్టేషన్‌ను సౌత్‌ సెంట్రల్‌, సదరన్‌, సౌత్‌ వెస్ట్రన్‌, సౌత్‌జోన్‌ రైల్వేల కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌, బెంగళూరు) ప్రంజీవ్‌ సక్సేనా బుధవారం పరిశీలించారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక రైలులో చీరాల నుంచి వచ్చిన ఆయన నూతనంగా నిర్మించిన ఫ్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడోలైన్‌ పనులకు సంబంధించి ఏర్పాటు చేసిన ఛార్టుల ద్వారా సంబంధిత శాఖల అధికారులు సక్సేనాకు వివరించారు. ఛార్టుల ఆధారంగా సీఆర్‌ఎస్‌ కొన్ని ప్రశ్నలు అడిగి సంబంధిత శాఖల అధికారుల నుంచి సమాధానాలు రాబట్టారు. అనంతరం ప్రత్యేక ట్రాలీపై నూతనంగా నిర్మించిన మూడో రైల్వేలైన్‌పై చినగంజాం నుంచి చీరాల వెళ్లారు. సక్సేనాతో పాటు విజయవాడ రైల్వే డివిజనల్‌ అధికారి శివేంద్రమోహన్‌ ఒక ట్రాలీపైన, వారి వెనుక మరో మూడు ట్రాలీలపై వివిధ శాఖలకు చెందిన రైల్వే అధికారులు వెళ్లినవారిలో ఉన్నారు. మోటారు ట్రాలీపై చినగంజాం నుంచి చీరాల రైల్వేస్టేషన్‌ వరకు వెళ్లిన ప్రంజీవ్‌ సక్సేనా సాయంత్రం చీరాల నుంచి చినగంజాం వరకు ప్రత్యేక రైలులో మూడో లైన్‌పై ట్రయల్‌రన్‌ నిర్వహించారు. అంతుకుముందు వేటపాలెం రైల్వేస్టేషన్‌లో నిర్మించిన నూతన భవనాన్ని సక్సేనా తనిఖీ చేశారు. దానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని