logo

రైలు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రైలు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన స్టూవార్టుపురం-బాపట్ల రైల్వేస్టేషన్‌ల మధ్య చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...

Published : 30 Mar 2023 05:28 IST

అభిషేక్‌ (పాతచిత్రం)

చీరాల నేరవిభాగం, న్యూస్‌టుడే: రైలు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన ఘటన స్టూవార్టుపురం-బాపట్ల రైల్వేస్టేషన్‌ల మధ్య చోటుచేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని కావూరివారిపాలెం పంచాయతీ ఆంధ్రకేసరి నగర్‌కు చెందిన డి.ధనరాజ్‌, అవ్వమ్మ దంపతులకు అభిషేక్‌(25) ఒక్కగానొక్క కుమారుడు. ఇతను కొంతకాలంగా పెయింటింగ్‌ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు స్థానిక రవిగార్డెన్స్‌ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు బుధవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి చీరాల ఏరియా ఆసుపత్రిలో శవపరీక్ష చేసి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికందొచ్చిన కుమారుడు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని