logo

31న లాంఫాం శతాబ్ది ఉత్సవాలు

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం శతాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 30 Mar 2023 05:28 IST

ఉత్సవాల కోసం నిర్మించిన నూతన భవనం

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం శతాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 31వ తేదీన లాంఫాంలో వేడుకలు నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి హాజరు కానున్నారు. 1922లో జిల్లాలోని లాం గ్రామంలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంను నాటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నాటి నుంచి నేటి వరకు అపరాలు, ఇతర పంటల్లో శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు రైతులకు ఎంతో మేలు చేశాయి. శతాబ్ది వేడుకలను పురస్కరించుకుని నూతనంగా నిర్మించిన భవనంతో పాటు రైతు విగ్రహాన్ని ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఆదాల విష్ణువర్ధన్‌రెడ్డి ఆవిష్కరిస్తారు. పదవీ విరమణ చేసిన శాస్త్రవేత్తలతో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, రైతులతో చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 100 సంవత్సరాల్లో చేసిన పరిశోధనలపై పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఆంగ్రూ పరిశోధన సంచాలకులు ఎల్‌.ప్రశాంతి, లాంఫాం ఏడీఆర్‌ సుబ్బారావు ఆధ్వర్యంలో శతాబ్ది ఉత్సవాల పనులు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు