‘ఫ్యామిలీ డాక్టర్’ సన్నాహక ఏర్పాట్లపై సమీక్ష
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 6 నుంచి ఫ్యామిలీ డాక్టర్ పథకం సీఎం చేతులమీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో సన్నాహక ఏర్పాట్లపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్
మాట్లాడుతున్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ చిత్రంలో జేసీ శ్యామ్‌ప్రసాద్, డీఎంహెచ్‌వో శోభారాణి తదితరులు
చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 6 నుంచి ఫ్యామిలీ డాక్టర్ పథకం సీఎం చేతులమీదుగా ప్రారంభించనున్న నేపథ్యంలో సన్నాహక ఏర్పాట్లపై ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ జేసీ శ్యామ్‌ప్రసాద్‌తో కలసి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల వైఎస్సార్ క్లినిక్‌లో బుధవారం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కోసం 104 వాహనాలు 260 ఇప్పటికే ప్రారంభించిన నేపథ్యంలో వాటి ద్వారా అందుతున్న సేవలు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ కార్యక్రమం పైలెట్ ప్రాజెక్టుగా నిర్వహిస్తున్నారు. ఐసీడీఎస్, సచివాలయం, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందితో పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నోడల్ అధికారి డాక్టర్ రమేష్, జాయింట్ డైరెక్టర్లు డాక్టర్ అనిల్, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ అర్జునరావు, డాక్టర్ గ్లోరీ, డీఎంహెచ్‌వో శోభారాణి, తహసీల్దార్ సుజాత, పీహెచ్‌సీ వైద్యులు రాజేష్, ఐసీడీఎస్ పీడీ ఇందిర, డీఆర్‌డీఏ పీడీ బాలునాయక్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి