‘అర్హుల ఓట్లు తొలగిస్తే ప్రతిఘటన తప్పదు’
గ్రామాల్లో అర్హుల ఓట్లు తొలగించడానికి వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు బీఎల్‌వోలు సహకారం అందిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రతిఘటన తప్పదని తెదేపా నేతలు తహసీల్దార్ మధుబాబుకు విన్నవించారు.
తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న తెదేపా నేతలు
నూజండ్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో అర్హుల ఓట్లు తొలగించడానికి వైకాపా నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు బీఎల్‌వోలు సహకారం అందిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రతిఘటన తప్పదని తెదేపా నేతలు తహసీల్దార్ మధుబాబుకు విన్నవించారు. పమిడిపాడులో 36మంది అర్హుల ఓట్లు తొలగించడానికి ఫామ్-7 సమర్పించారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనర్హుల ఓట్లు తొలగిస్తే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డీఎల్‌డీఏ ఛైర్మన్ లగడపాటి వెంకట్రావు, నేతలు బచ్చు అంజిరెడ్డి, సోమెపల్లి బ్రహ్మయ్య, చౌదరి, వంకాయలపాటి పేరయ్య, వెంకట్రావు, రొడ్డా వీరాంజనేయరెడ్డి, బత్తుల సుబ్బారావు, గంగినేని హనుమంతరావు తదితరులున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ టికెట్లు ఫ్రీ.. నిర్మాత అభిషేక్ కీలక ప్రకటన.. వారికే మాత్రమే
-
India News
Viral Video: యువతిని కిడ్నాప్ చేసి ఎడారిలో ‘సప్తపది’.. పోలీసులేం చెప్పారంటే?
-
General News
AP News: సాధారణ బదిలీల్లో మినహాయింపుపై ఆ లేఖలు పరిగణనలోకి తీసుకోవద్దు: జీఏడీ
-
General News
Hyderabad: ‘నాపై కేసు కొట్టివేయండి’.. హైకోర్టులో నటి డింపుల్ హయాతి పిటిషన్
-
Politics News
Lakshman: రూ.లక్ష పేరుతో సీఎం కేసీఆర్ బీసీలను మోసం చేస్తున్నారు: లక్ష్మణ్
-
India News
మణిపూర్ హింస.. నేనేం తప్పు చేశాను.. నన్నెందుకు చంపారు అంకుల్!