logo

‘ఫాసిస్టు ప్రభుత్వాన్ని సాగనంపాలి’

ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా భాజపా ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను అవలంబిస్తోందని సీపీఐ రాష్ట్రసహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు.

Published : 30 Mar 2023 05:28 IST

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా భాజపా ప్రభుత్వం ఫాసిస్టు విధానాలను అవలంబిస్తోందని సీపీఐ రాష్ట్రసహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. అరండల్‌పేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ హిట్లర్‌ భావజాలాన్ని పుణికిపుచ్చుకొన్న ప్రధాని మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగుజాడల్లో పాలన చేస్తున్నారన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు అందుకు నిదర్శమన్నారు. ప్రజాస్వామ్య భావనలను గౌరవించే పార్టీలన్నీ ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ ఆకస్మిక దిల్లీ యాత్రలు రాష్ట్రం కోసం కాదన్నారు. తనను తాను రక్షించుకునేందుకు దిల్లీ వెళుతున్నాడని విమర్శించారు. ఏప్రిల్‌ 14 నుంచి మే 15 వరకు సీపీఐ గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుంటామన్నారు. అలాగే వరికెపూడిసెల, హరిశ్చంద్రపురం నుంచి నకరికల్లు వరకు ఎత్తిపోతల తదితర ప్రాజెక్టులకు నిధులు సమీకరించి పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రానికి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్‌ చేశారు. మాదిపాడు, అమరావతి నుంచి నేరుగా జిల్లా కేంద్రానికి బస్సులు వేయాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి మారుతీవరప్రసాద్‌, జిల్లా సహాయ కార్యదర్శులు హుస్సేన్‌, కాసా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని