logo

వందేభారత్‌ రైలు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్‌ రైలును ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి గుంటూరు మీదుగా నడపాలని రైల్వే అధికారులు ఇప్పటికే నిర్ణయిచారు.

Published : 30 Mar 2023 05:28 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే వందేభారత్‌ రైలును ఏప్రిల్‌ 8వ తేదీ నుంచి గుంటూరు మీదుగా నడపాలని రైల్వే అధికారులు ఇప్పటికే నిర్ణయిచారు. దీంతో ప్రారంభోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు రైల్వే డివిజన్‌ రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో విస్తరించి ఉన్నందున మార్గం మధ్యలో ఉన్న ప్రజాప్రతినిధులను ఆ రైలులో ప్రయాణించాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా విద్యార్థులను కూడా ఆ రైలులో ప్రయాణించేందుకు ఆహ్వానిస్తున్నారు. వీరిని పక్క స్టేషన్‌ వరకు తీసుకువెళ్లి తిరిగి వారిని మరో రైలులో వెనక్కి పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రైలు ఇంజిన్‌ మరమ్మతులకు గురైతే తక్షణమే బాగు చేసేందుకు వీలుగా గుంటూరు నుంచి 15 మంది ఉద్యోగులను ఇప్పటికే శిక్షణకు పంపారు. ఈ రైలు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి సికింద్రాబాద్‌ రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల ప్రారంభోత్సవ తేదీ మార్పు చేసేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు