logo

నేటి నుంచి యార్డుకు నాలుగు రోజులు సెలవులు

మిర్చి క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. యార్డుకు వచ్చిన బస్తాల కంటే విక్రయాలు జరిగిన బస్తాలు అధికంగా ఉన్నాయి.

Published : 30 Mar 2023 05:28 IST

గుంటూరు, న్యూస్‌టుడే: మిర్చి క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. యార్డుకు వచ్చిన బస్తాల కంటే విక్రయాలు జరిగిన బస్తాలు అధికంగా ఉన్నాయి. యార్డుకు గురువారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు రావడంతో రైతులు అధికంగా బస్తాలను యార్డుకు తరలించారు. బుధవారం మొత్తం 1,15,161 బస్తాలు యార్డుకు వచ్చాయి. గత నిల్వలతో కలిపి 1,20,059 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో 82,824 బస్తాలు నిల్వ ఉన్నాయి. మిర్చి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. గురువారం శ్రీరామనవమి సందర్భంగా, శుక్రవారం ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా మార్చి 31న మిర్చి ఎగుమతి, దిగుమతి వ్యాపారుల విజ్ఞప్తి మేరకు సెలవు ప్రకటించామన్నారు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కావడంతో వరుసగా నాలుగు రోజుల పాటు మిర్చి క్రయవిక్రయాలు జరగవని, సోమవారం లావాదేవీలు జరుగుతాయని యార్డు కార్యదర్శి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని