logo

ఆ రెండు స్టేషన్లలో రైళ్లు ఆగవు

గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో మల్కాపురం, రంగాపురం స్టేషన్లలో పనులు జరుగుతున్నందున.. ఆ రెండు స్టేషన్లలో ఏప్రిల్‌ 1 నుంచి 15వ తేదీ వరకు కొన్ని రైళ్లు ఆగవని మండల రైల్వే అధికారి బుధవారం

Published : 30 Mar 2023 05:28 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో మల్కాపురం, రంగాపురం స్టేషన్లలో పనులు జరుగుతున్నందున.. ఆ రెండు స్టేషన్లలో ఏప్రిల్‌ 1 నుంచి 15వ తేదీ వరకు కొన్ని రైళ్లు ఆగవని మండల రైల్వే అధికారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మల్కాపురం స్టేషన్‌లో డోన్‌-గుంటూరు-డోన్‌ (17227/1728), నంద్యాల- కర్నూలు- నంద్యాల (07499/07498) రైళ్లు ఆగవని తెలిపారు. అదేవిధంగా రంగాపురం స్టేషన్‌లో డోన్‌-గుంటూరు- డోన్‌(17227/17228), నంద్యాల-కర్నూలు- నంద్యాల(07499/07498), హుబ్లీ- విజయవాడ-హుబ్లీ(17329/17330), సికింద్రాబాద్‌-గుంటూరు- సికింద్రాబాద్‌ (17254/17253) రైళ్లు ఆగవని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని