logo

పేదల ఆకలి తీర్చడమే దైవ సేవ

జిల్లెళ్లమూడి అమ్మతత్వంలో మానవసేవ పారాయణత్వం ఉందని ్జమాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. జిల్లెళ్లమూడిలో విశ్వజననీ పరిషత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మ శత జయంత్యుత్సవాల మూడో రోజు సభలో ఆయన ముఖ్య అతిథిగా గురువారం పాల్గొన్నారు.

Published : 31 Mar 2023 05:34 IST

మాజీ మంత్రి మాణిక్యవరప్రసాద్‌కు అమ్మ జ్ఞాపిక అందజేస్తున్న రవీంద్రరావు, నరసింహమూర్తి

బాపట్ల, న్యూస్‌టుడే: జిల్లెళ్లమూడి అమ్మతత్వంలో మానవసేవ పారాయణత్వం ఉందని ్జమాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ అన్నారు. జిల్లెళ్లమూడిలో విశ్వజననీ పరిషత్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమ్మ శత జయంత్యుత్సవాల మూడో రోజు సభలో ఆయన ముఖ్య అతిథిగా గురువారం పాల్గొన్నారు. తొలుత ఆలయంలో అనసూయాదేవి, హైమవతి దేవికి పూజలు చేశారు. రచయిత కొండముది సుబ్బారావు రచించిన ‘అమ్మచే ప్రభావితులు’ పుస్తకాన్ని కమలానంద భారతీస్వామితో కలిసి ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చటమే దైవసేవగా అమ్మ భావించి ఆచరణలో చూపి వేల మంది భక్తులను ఆ మార్గంలో నడిపిస్తున్నారన్నారు.

మాట్లాడుతున్న కమలానంద భారతీస్వామి

అపర అన్నపూర్ణాదేవిగా నిలిచారన్నారు. గన్నవరం భువనేశ్వరి పీఠం పీఠాధిపతులు కమలానంద భారతీస్వామి మాట్లాడుతూ లక్ష మందికి అన్నం పెట్టిన అమ్మ ఆదిపరాశక్తి అవతారం అన్నారు. రామాయణంలో మనకు కనిపించిన శబరి ఈ యుగంలో జిల్లెళ్లమూడి అమ్మగా వచ్చి బిడ్డలలో శ్రీరామచంద్రుడిని చూసి గోరుముద్దలతో అన్నం తినిపించారన్నారు. భారతీయ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ దళిత వర్గాలను కన్నబిడ్డలుగా ఆదరించిన అమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా పెట్టి నేటి తరాలకు తెలియజేయాలని పేర్కొన్నారు. విశ్వజననీ పరిషత్‌ ట్రస్టు ఛైర్మన్‌ కుమ్మమూరు నరసింహమూర్తి, ధర్మకర్తలు ఎం.దినకర్‌, బ్రహ్మాండం రవీంద్రరావు, డీవీఎన్‌ కామరాజు, రచయితలు కొండముది సుబ్బారావు, ఉప్పల వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని