logo

ద్రవిడ సంప్రదాయంలో సాక్షాత్కరిస్తున్న ఉభయదేవేరులు

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం భర్తకు ఎడమవైపున భార్య ఉంటుంది. ద్రవిడ సంప్రదాయం ప్రకారం అన్ని విషయాల్లో మహిళకు అధిక ప్రాధాన్యం ఉంటుంది.

Published : 31 Mar 2023 05:34 IST

స్వామి వారికి కుడివైపున అమ్మవారి విగ్రహాలతో పూజలు

కాకానిపాలెం కోదండరామస్వామి ఆలయంలో స్వామికి కుడివైపున సీతాదేవి

అద్దంకి, న్యూస్‌టుడే: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం భర్తకు ఎడమవైపున భార్య ఉంటుంది. ద్రవిడ సంప్రదాయం ప్రకారం అన్ని విషయాల్లో మహిళకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. వివాహ సమయాల్లోనూ పెళ్లి కుమార్తెను కుడివైపున కూర్చోబెడతారు. దీనికి అనుగుణంగా ద్రవిడ సంప్రదాయం పాటించే వారంతా తమ ఇష్టదైవమైన వేంకటేశ్వరస్వామి, శ్రీరామచంద్రమూర్తి ఆలయాల నిర్మాణాల్లో అమ్మవారిని స్వామి వారికి కుడివైపున ఉంచి పూజలు జరుపుతారు. దీనికి ప్రధాన కారణంగా వారు చెప్పేదేమంటే స్వామి వారి కుడిహస్తాన్ని దీవించే హస్తం అంటారని, అందువల్ల అమ్మవారిని కుడిహస్తంగా భావించినట్లు వారి అభిప్రాయం. ఈవిధంగా నిర్మించిన రామాలయాల్లో బాపట్ల జిల్లాలో అద్దంకి, మోటుపల్లి, నూతలపాడు, ప్రకాశం జిల్లాలో కనపర్తి, చదలవాడ ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాల్లో శ్రీరామచంద్రమూర్తికి కుడివైపున సీతాదేవి అమ్మవారిని ఉంచి పూజలు చేస్తారు. అద్దంకి కాకానిపాలెం యాదవ బజారులోని కోదండరామస్వామి ఆలయంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. మిగిలిన దేవాలయాల్లో అమ్మవారు స్వామి వారికి ఎడమవైపునే ఉంటారు. వైఖానస విధానంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చారిత్రక పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని