logo

కోర్టు చెప్పినా... పనులు ఆపలేదని ఫిర్యాదు

మురికిపూడిలో ఎస్సీ రైతుల సాగు భూముల్లో గ్రానైట్‌ తవ్వకాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యథాతథస్థితి(స్టేటస్‌కో) ఇచ్చినా పనులు ఆపలేదని, ప్రశ్నించిన తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ.

Published : 31 Mar 2023 05:34 IST

చిలకలూరిపేట గ్రామీణ: మురికిపూడిలో ఎస్సీ రైతుల సాగు భూముల్లో గ్రానైట్‌ తవ్వకాలకు సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం యథాతథస్థితి(స్టేటస్‌కో) ఇచ్చినా పనులు ఆపలేదని, ప్రశ్నించిన తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ ఎస్సీ రైతులు జమ్మలమడక పున్నారావు, ఎన్‌.ఏసురాజు, జె.రవికుమార్‌, జె.రత్నరాజు గురువారం చిలకలూరిపేట గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఎస్సీ రైతులమని, తమ పూర్వీకులకు 1975లో డీకే పట్టాలను జీవనం కోసం ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వారి తదనంతరం వారసులమైన తాము వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఈ క్రమంలో మైనింగ్‌ అధికారులు కొందరికి ఆ భూములను అక్రమంగా లీజు కేటాయించి, తమ హక్కులకు భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఆ మేరకు కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితి ఆదేశాలు ఇచ్చిందన్నారు. గురువారం 10 గంటల సమయంలో మా భూముల్లో గ్రానైట్‌ తవ్వకాల పనులు చేస్తున్న సంబంధిత కార్మికులు, మేనేజర్‌తో పనులు నిలిపివేయాలని, కోర్టు ఉత్తర్వులు చూపించినా ఇవేమీ పట్టించుకోకుండా తవ్వకాలు కొనసాగించారన్నారు. దీంతోపాటు ఆపటానికి వస్తారా? అంటూ మమ్మల్ని దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. మాపై దాడి చేయడానికి ప్రయత్నించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాణ రక్షణ నిమిత్తం భయపడి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని