logo

ఒక్కరోజే రూ.3.5 కోట్లకు పైగా పన్ను వసూలు

నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్ను డిమాండ్‌, బకాయిలు ఏకమొత్తంలో చెల్లించే వారికి వడ్డీ మాఫీ వర్తించే గడువు శుక్రవారం ముగియనుంది.

Published : 31 Mar 2023 05:34 IST

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్ను డిమాండ్‌, బకాయిలు ఏకమొత్తంలో చెల్లించే వారికి వడ్డీ మాఫీ వర్తించే గడువు శుక్రవారం ముగియనుంది. నగరంలో మొత్తం 1,92,715 అసెస్‌మెంట్లు ఉండగా డిమాండ్‌ రూ.146.40 కోట్లుగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు రూ.114 కోట్లకు పైగా పన్ను వసూలైంది. గురువారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.3.50 కోట్లకు పైగా వసూలైట్లు రెవెన్యూ విభాగం అధికారులు తెలిపారు. శుక్రవారం పన్నుపై వడ్డీ మాఫీకి ఆఖరిరోజు కావడంతో భారీగా పన్ను వసూలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం జీఎంసీ ప్రధాన, సర్కిల్‌ కార్యాలయాల్లో నగదు కౌంటర్లు ఉదయం 8 నుంచి రాత్రి 11 గంటల వరకు పనిచేయనున్నాయి. నిర్ధేశించిన వార్డు సచివాలయాల్లో నగదు కౌంటర్లు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటాయని అధికారులు తెలిపారు. పన్ను వడ్డీ మాఫీకి ఉన్న ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఏక మొత్తంలో పన్ను చెల్లించాలని అధికారులు కోరారు. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి యథావిధిగా పన్నుపై వడ్డీ పడుతుందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని